హైకూలు :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
కడుపు పంట 
    కొమ్మ భారమనలే 
అమ్మలా ఉంది 

చెలి కానుక 
   మనసులో నిండింది 
ప్రేమ పండింది 


తోటలో మాలి 
   నిద్ర పోతున్నాడేమో 
శ్రమ ఫలాలు 


కొమ్మ ఎండింది 
   కాలం ఒకనాడలా 
పండుగైందిలా 


రవి కిరణం 
   ఉభయ సంధ్యల్లోని 
రంగులిచ్చింది కామెంట్‌లు