ప్రత్యేకత;-లతా శ్రీ -పుంగనూరు
 రాజు,రాము స్నేహితులు.ప్రతిరోజు ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్ళేవారు.ఒకరోజు పరిసరాల విజ్ఞానం టీచరు.మీ పరిసరాలను పరిశీలించి,పనికిరాని మొక్కలు జాబితా తయారు చేసుకురమ్మంది.
తరగతిలోని పిల్లలుతమకు తోచిన మొక్కల పేర్లు రాశారు.రాము ఏమి రాయలేదు అన్ని మంచివే అంటున్నాడు టీచర్ అన్నాడు రాజు.టీచర్ తరగతి గదిలో ప్రవేశించిన వెంటనే,టీచర్ రాముని పిలిచి అడిగింది.నాకు ఏ మొక్క పనికిరాని దిగా కనిపించలేదు టీచర్ అన్నాడు భయపడుతూ...టీచర్ నవ్వుతూ రాము తల నిమిరి
రాము చెప్పేది నిజమే గడ్డిపోచ కూడా ఆవుకు మేత అవుతుంది కదా...మొక్కలు వేటికవే ప్రత్యేకమైనవి
అన్నది.
సూక్తి:పనికి రానిది అంటూ ఏదీ లేదు .మనం చూసే దృష్టి ని బట్టే ఉంటుంది

కామెంట్‌లు