రుబాయిలు ;-ఎం.వి. ఉమాదేవి
ఏటికి ఎదురీదినా మంచిగట్టు చేరుతావు 
పాటగాను బ్రతుకంతా సాగాలని కోరుతావు 
ధర్మం ఆచరణలోన దైవమే  కనిపిస్తుంది 
దీనార్తుల సేవలలో  చేయూతగ మారుతావు! 

లలితరాగ భావాలకు లోకంలో చోటులేదు 
ఆహ్లాదపు విషయాలకు  శోకంలో చోటులేదు 
ఎప్పటికప్పుడు చేసే బ్రతుకుయుద్ధమిలా ఉంది 
గాయపడిన హృదయాలకు నాకంలో చోటులేదు!


కామెంట్‌లు