శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు :-....వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.
ప్రశాంత దివ్య మంగళ విగ్రహుడు 
భగవంతుండును విశ్వగర్భుండు 
ప్రాప్యంబును ప్రాప్త కంబును 
ప్రాప్తియు యనేటి బేధ శూన్యుండు          7891 

గావున మహాకాశము నందునను 
ఘట పటాద్యాకాశంబు లైనను 
వేఱు లేక యేకంబై తోచు 
చందమున అబేధముగ పొడగనను        7892 

రాజులవలె కింకర జనుల వలెను 
ఆజ్ఞాపించేటి చందంబునను 
ఈశ్వర దండన భయముతో 
తలంచితీరేని వారించగను        7893 

భూసుర వేషధారుల మాకును
వైకుంఠా సర్వేశ్వరునకును 
బేధము లేదు శంక వలదు 
అనుచిత కర్మలందును మీకును           7894 

మదీయ శాపార్ధులగుదురు 
భూలోకంబున పుట్టుదురు 
కామక్రోధములను శత్రువులచే 
మీరును బాధింపబడుదురు  7895 

యని పలికిన వారలు విని మనముల 
బ్రాహ్మణుల శాప శర పరంపరల 
అడ్డుకోలేక తల్లడిల్లిరి ద్వారపాలకులైన జయవిజయుల   7896 

సరసిజ లోచన నీ భటుల నిటల 
సనకాది మునుల పాదంభుజముల 
పరితాపంబును పొందుచు 
కర మర్దిన్ మ్రొక్కి ఘటితాంజలుల   7897 

యిట్లనిరి .......

పరమ యోగీశ్వరులార మమ్మును 
మదినొవ్వగ నిష్టూర మాటలును 
దానికి మేము చింత బొము
సత్పురుషులను పరాభవించగను   7898 

మేము చేసుకున్న పాపములు 
మాకు తెచ్చెను కీడు చేటులు 
మా జన్మ వృధా యయ్యెను 
ఈ పైన పొందెదము శుభములు      7899 

అది యెట్లంటిరేని.........

మీ కరుణావలోక సమేతలుగ 
దయా వీక్షణాల అనుగ్రహముగ 
మా ప్రార్థన త్రోసి పుచ్చిక శ్రీహరి నామమును మరువకుండగ     7900 

........


కామెంట్‌లు