చిన్ననాటి దసరా ఉత్సవాలు.;-తాటికోల పద్మావతి గుంటూరు.

 మా ఊళ్లో దసరా ఉత్సవాలు పది రోజులు చాలా ఘనంగా చేస్తారు. దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి కుడి వైపున పెద్ద టాటా ఆకుల పందిరి వేస్తారు. ఆ రోజుల్లో అదంతా మట్టినేల. ప్రతిరోజు ఆ పందిరిలో ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఉదయం ఇటు గుళ్లో పూజలు జరుగుతూ ఉంటే, అటు పందిరిలో హరికథలు బుర్రకథలు చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం సాయంకాలం చెక్క భజనలు కోలాటం, రాత్రికి తోలుబొమ్మలాటలు ఆడించే వాళ్ళు. చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా ఆ మట్టి నేల మీద చాపలు గోనె సంచులు పరుచుకొని కూర్చునేవారు. వర్షం వస్తే నేలంతా తడి బురదగా అయ్యేది. వరిపొట్టు పోసి ఇ శుభ్రం చేసే వాళ్ళు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి కార్యక్రమాలు చూసుకొని తిరిగి వెళ్లే వాళ్ళు. అప్పటి రోజుల్లో ఇది పైసలు మూడు పైసలు వాడే రోజులు. రెండు పైసలు ఒక ఐస్ ఫ్రూట్ ఇచ్చేవాళ్ళు. మూడు పైసలకు మొక్కజొన్న పొత్తులు ఇచ్చేవాళ్ళు. పిల్లలంతా చేరి రంగులరాట్నం తిరిగేవాళ్లు. పిల్లల కోసం లాటరీ వేసేవాళ్ళు. ఆ చుట్టు పక్కల అంతా రకరకాల బొమ్మలు మిఠాయిలు రంగులరాట్నం, ఇంకా రకరకాల గారడీలు చూపించే వాళ్ళు. ఆ పది రోజులు పులి వేషాలు వేసుకుని డబ్బులు వాయించుకుంటూ రోడ్లమీద అ గంతులు వేసుకుంటూ వస్తారు. బడి పిల్లలు అంతా పద్యాలు పాడుకుంటూ ఇంటింటా చందాలు వసూలు చేస్తారు. సరస్వతి పూజ రోజున పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించి పలక బలపం తో పాటు పప్పు బెల్లాలు వాళ్లు. దుర్గాష్టమి మహిషాసుర మర్ధిని విజయదశమి నాడు విజయలక్ష్మి అవతారాలతో అలంకరించి దేవాలయం కిక్కిరిసిన జనంతో నిండిపోయేది. చిన్నప్పటినుంచే హరికథలు వినడం అలవాటు అయ్యేది. చెక్క భజనలు కోలాటాలు చాలా ఆనందాన్ని కలిగించేవి. తోలుబొమ్మలాటలు అయితే కడుపుబ్బ నవ్వించే వి. ఇలా పది రోజులు బడికి సెలవులు కావటం చేత పిల్లలంతా స్నేహితులతో చేరి దసరా పది రోజులు గుడి దగ్గర సందడి సందడి గా చేసే వాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు ఏవి. టీవీలు సెల్ ఫోన్ లో కి అలవాటు పడ్డారు. పిల్లల కోసం మన జ్ఞాపకాలు అని చెప్తూ ఉంటే వాళ్లకి కూడా అలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది ‌ వాటిని మనం చూపించ లేక పోయినా మన చిన్ననాటి సంగతులు కథలు కథలుగా చెప్తుంటే శ్రద్ధగా వింటారు. వాటిని మధుర జ్ఞాపకాలు గా దాచుకుంటారు
కామెంట్‌లు