రాజ్ భవన్ లో బతుకమ్మ సందడి


 రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై తో బతుకమ్మ సంబరాల్లో జగిత్యాల నుండి అయిత అనిత కు అవకాశం
తేదీ 7/10/21 గురువారం  హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగే బతుకమ్మ సంబరాల్లో రెండో రోజు వేడుకల్లో భాగంగా జగిత్యాల నుండి అక్షరయాన్ అనే సంస్థ ప్రతినిధి గా ప్రముఖ కవయిత్రి అయిత అనిత కు ఆహ్వానం అందగా గవర్నర్ తమిళ సై తో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనితను కళాశ్రీ అధినేత గుండేటి రాజు ఆవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్ పి.ఆర్.టి.యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు మరియు వి.కే.బి ఆటపాట మిత్రబృందం అభినందించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం  హర్షనీయం అన్నారు.

కామెంట్‌లు