శ్రీ దేవీ నవరాత్రులు * దసరా ఉత్సవాలు: పరికల్పన : రామానుజం. ప. విశ్రాంత ఉపాధ్యాయుడు.
 * అందరికీ * శుభాకాంక్షలు
                 
                ~~~~~~~~~~~~~
సీస   పద్యం  :
విజయోత్సవ మెయగు విజయ దశమనగ,
          లోక  కంటకు  , గూల్చె  లోక మాత   !
తల్లిని    ప్రార్ధించ    నవరాత్రి  పండుగ  ,
          దశమి నాటితొ   సావధాన మగును ;
అవతార మూర్తిని     ఆత్మతో  కొలువగా,
            సర్వ జనులకును   సంతసమగు   ;
దసరాను   పాఠించ   ధన్యమగును  జన్మ  ,
            పిల్ల  పాపల తోడ ,   పెద్దలకును  ;
తేటగీతి   :
      కాళికా శక్తి  రూపాలు  కాంచ గాను ...
శైల పుత్రిగ , బ్రహ్మ చారిణిగ  , చంద్ర
కాంత  ,కూష్మాండ ,స్కందమా ,కాత్యయనిగ,
కాళరాత్రి   ,మహా గౌరి  గాను      మరియు
సిద్ధ రాత్రి  యై   మహిషాసురిని వధించె   !!
తేటగీతి   :
దినము  కొక  దేవి   రూపాన  దివ్యముగను
కొలిచి -- ఆయుధ , సామగ్రి  కూర్చు కొనగ ,
జవము     నీయగ   వేడుచు    చల్లగుండ  ,
వినతి   సేతుము  మేమెల్ల  వినయముగను  !!
ఓం~~~~~~~~~@~~~~~~~~~AUM
కంద పద్యం   :
బడి  పిల్లలు కోరుదురే   ,
బడి పిల్లల కేమొ  పప్పు బెల్లాలీయన్  ;
బడిలో   గురువుకు  కట్నము   ,
గుడిదేవుని మ్రొక్కు,వార్ల గుణముల నుంచన్ !!
ఆట వెలది   :
వారి, వారి  యిండ్ల  వరుసలో  వెళ్ళుచూ  ,
  ఇళ్ళ వద్ద   ,   పాట   యింపు  చేసి   ,
పూల బాణములతొ  పూజించి  ,  దీవించి,
    తాము     పంచు కొంద్రు    తాయిలాలు  !!
~~~~~~~~~~~ఓం~~~~~~~~~~~

కామెంట్‌లు