భయం వీడుమా:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
ఓడ మని వెరవకుండా
సాధనతో నడుస్తుంటే
కృషిని పెంచిన వారెప్పుడూ
గెలవగలరు తప్పక 

ప్రయత్నాలు చేయరూ
అసాధ్యమని సాగరూ
గెలుపు అన్నది కోరరూ
శిలలాగ వుంటారు

మొదలు పెట్టే ఆపకూ
ఓడానని తలవకూ
పట్టుదలతొ సాగుమా
గెలుపునే పట్టుమా

కామెంట్‌లు