జీవశ్చవాలు ...!!> కవి;డా.కె.ఎల్.వి.ప్రసాద్. > హన్మకొండ.*

 మనల్ని పాలించడానికి
కుక్క గొడుగుల్లా పెక్కు పార్టీలు!
అందరూ..నాయకులే..
ప్రజల్ని దో చుకొడానికి,
అధికారం వెలగబెట్టడానికీ
అందినంత---
వెనకేసుకోవడానికి...!!

ప్రతిపార్టీకి ఒక చానెల్,
ఒక వార్తా పత్రిక,
అంతా ఒకడికొకడు
వ్యతిరేకం....
వార్తలన్నీతికమక,
ప్రజలే పిచ్చి వాళ్లు,
తమ విలువ ఏమిటో....
ఇంకా...తె లియ నోళ్ళు!
తరతరాలుగా----
మోసపోతున్నవాళ్ళు 
చైతన్యం ఒంటబట్టని 
జీవశ్చవాలు వాళ్ళు !!

కామెంట్‌లు