వివాహ బంధం: -డా" కందేపి రాణి ప్రసాద్

వివాహం పవిత్ర బంధం
వివాహం మధుర ఘట్టం
వివాహం జీవన కావ్యం
వివాహం సుస్వరా గానం 

అమ్మాయికి విద్యాలన్ని నేర్పించి
అధ్యజమైన ప్రేమను పంచి
అపురూపంగా గారంగా పెంచి
అత్త వారింటింకి అంపకం చేయాలి 

అబ్బాయిని చక్కగా చదివించి
అల్లారు ముద్దుగా బుద్దిగా పెంచి
అందమైన అడపిల్లనుతెచ్చి
అనురాగల జంటగా మార్చాలి! 

తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని 
తెరచాటు నుంచి తొంగి చూస్తూ
తాళి కట్టినప్పటి నుంచి ఒక్కటై
తరతరాల వ్యవస్థను నిలపాలి! 

సామరస్యంతో  సర్దుకుపోవాలి
సమన్వయంతో ముందుకు సాగాలి
సంసార రథాన్ని సరిగా నడపాలి
సర్వదా సుఖంగా జీవించాలి!
కామెంట్‌లు