అధిక శ్రమ వలన, అలసట వలన, తగిన విశ్రాంతి తగ్గటం వలన, ఒంటి నొప్పులు వస్తాయి. జ్వరం కూడా రావచ్చు.
నీళ్ళను వేడి చేసి, అందులో పసుపు వేసి తాటి కలకండ కూడా కలిపి త్రాగడం వలన ఒంటి నొప్పులు పోతాయి.
కాళ్లల్లో చేతుల్లో మంటలు
తగ్గడానికి...
కాకరాకు ముద్దగా నూరి కాళ్లకు చేతులకు పూసుకుంటే
మంటలు వెంటనే తగ్గిపోతాయి..
మంచి నిద్ర పట్టడానికి...
అరటిపండు గుజ్జులో జిలకర్ర పొడి కలిపి అందులో తేనె కూడా వేసి తినాలి. దీనితో మంచి నిద్ర వస్తుంది.
గోరింటాకు ముద్ద (మైదాకు )లో కొబ్బరి నూనె కలిపి సన్నని మంటపై కాచి వడగట్టి కొద్ది నూనె ను మాడుపై రాసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరగడానికి...
అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలను తినాలి.
ఆహారంలో పసుపు ఎక్కువగా వాడాలి.
ఉసిరికాయ లేక ఉసిరికాయ పచ్చడి లేదా ఉసిరికాయ పొడి (Amla Powder ) ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తినాలి.
అశ్వగంధ పొడి ని ప్రతిరోజు తేనెతో కలిపి తీసుకోవాలి.
ఇది మంచి శక్తివంతమైన మందు. ఇవన్నీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి