*మిట్టపల్లి నానీలు*;- మిట్టపల్లి పరశురాములు
ధనము పదవులు
ఎన్నిఉన్నా
వెంటేవిరావు
వెళ్ళిపోయెవేళ

బంధుబలగము
ఎంత ఉన్నా
ఊపిరెళ్ళినాక
ఎవరురారువెంట

పట్టువలువలు కట్టి
పసిడికంచంలో
తిన్నగాని
బుడ్డగోసెనీకురన్నా!

అద్దాలమేడలున్నా
అందలంపైనున్నా
చివరికి
కట్టెపాడెరన్నా

పంచభక్ష్యాలు
పరమాన్నంతిన్న
జీవెళ్ళెనాడు
చిప్పకూడే!

జమీందారువైన
ధాన్యరాసులున్నా!
ఆరడుగులజాగే
స్థిరమునీకన్నా
       ***

కామెంట్‌లు