బాల గేయం-మల్లెపూవు:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 మల్లెపూవు మల్లెపూవు
చాలా చాలా తెల్లగుంటది
పట్టుకుంటే మృదువుగా
వేళ్ళను తాకుతుంటది
పసిపాపల చిరునవ్వోలె
స్వచ్ఛంగా కనిపిస్తుంటది
ఆకుపచ్చని ఆకాశంలో
తారకలా మెరుస్తుంటది
మంచితనపు స్నేహానికి
తానే చిరునామా అంటది
సువాసనతో మనసును
మైమరపిస్తూ ఉంటది
హృదయంలో ఉల్లాసం
ఉత్తేజం నింపుతుంటది

కామెంట్‌లు