ప్రార్థనతో అనంత ప్రయోజనం ;--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 ఏ నిమిషానికి ఏమి జరుగునో 
ఎవరూహించెదరూ... 
అన్న గీతంలో కవిగారన్నట్టు... 
అనిశ్చితమైన మానవ జీవితంలో 
ఆత్మ విశ్వాసం,స్వస్థత, 
స్వ శక్తిపైన నమ్మకం కలిగేలా 
ఉపకరించే సాధనములే పూజలు,  ప్రార్థన!
మంచి ఆలోచనలూ,ఆచరణలూ 
కలిగేలా రూపొందిన మతాలు 
కొన్ని విధి విధానాలు ఏర్పరిచి 
వాటికి కట్టుబడి ఉండేలా 
ప్రార్థన,దాన ధర్మాలు చెప్పాయి!
ప్రార్థనలో స్వ  ప్రయోజనం 
ఆశించక.. 
విశ్వ శ్రేయస్సు,సౌభ్రాతృత్వo 
ప్రకృతి పరిరక్షణ కోరుతూ 
ఆత్మార్పణ ధోరణిలో 
అంతర్యామిని వేడుకొనడం 
గొప్ప బలాన్ని, శాంతినీ ఇస్తూ 
దైనందిన జీవితం 
సాఫీగా సాగేలా చేసే ప్రార్థన !
పూజ  లేనిదే ఆహారం తీసుకోని వాళ్ళున్నారు!
ప్రార్థనలో పూజ లో తన్మయత్వం పొందే 
స్ధితి 
చాలా అద్భుతం,అనిర్వచనీయం!
కామెంట్‌లు