అద్భుతము 'నాన్న';---గద్వాల సోమన్న
నాన్న మనసు త్యాగము
కుటుంబాన మోదము
సృష్టిలో అద్భుతము
జాలువారు అమృతము

వెలుగులీను దీపము
భగవంతుని రూపము
సదనానికర్పితము
నాన్న మహోన్నతము

నాన్న ప్రేమ శిఖరము
వారు ఉన్న పదిలము
విజయానికి అభయము
దీవెనలకు నిలయము

నాన్నొక ఆయుధము
అభివృద్ధి సాధనము
ఇంటికి మూలధనము
నడిపించు ఇంధనము


కామెంట్‌లు