అంతరాలు:- సత్యవాణి

 బాల్యం ఒక అధ్భుతం
అది కోరుకోకుండా లభించే  
మనవునికి మాత్రమే లభించిన ఒకవరం
స్నేహించడానికి కారణాలుండవు
ప్రేమ పంచుకొనడానకీ బేధాలు తెలియవు
పేదా ధనికా
కులమా మతమా
రూపా 
కురూపా
ఏమీ తెలియదు
స్నహించడానికై
మాటలు పంచుకోవడం
ఆటలనూ పంచుకోవడం
కాకెంగిలితో కాయలనూ పంచుకోవడం
అడపా తడపా
అయ్యవారు కొట్టే దెబ్బలనూ
పంచుకోవడం
స్నేహితునికి నోప్పి పుడితే
కన్నీళ్ళనూ పంచుకోవడం
తారతమ్యాలు తెలియని బాల్యం
తరగని నిధిలా
గుండెలో గుర్తుండి పోయేది
జ్ఞాపకాల గుర్తులలో
తాజా పూలవలే సుగంధాలు వెదజల్లేది
తనంతవారు తామైనా
తారతమ్యాలు ఎంచనిదీ ఒకనాటి ఆ బాల్యం
          

కామెంట్‌లు