పుస్తకం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

పుస్తకం పిల్లలకు నేస్తం
ఎప్పుడు కావాలిరా కన్నా
రోజూ నియమం తప్పక
చక్కగ చదవాలిరా చిన్నా

రంగురంగుల చిత్రాలతో
మనసును అలరించును
రకరకాల వింత కథలతో
ఊహాల్లోకి తీసుకెళ్ళును

విజ్ఞాన శాస్త్ర విషయాలెన్నో
తెలియజేస్తూ ఉండును
అపోహలు అజ్ఞానాన్ని
తొలగించి తెలివి పెంచును

కామెంట్‌లు