నువ్వు అవునంటే
అదివేదం ....!
నువ్వుకాదంటే,
అదివివాదం !!
---------------------------
అతడి నిశ్శబ్దం...
నీ గెలుపు కాబోదు!
నీ గౌరవం.....
అతడి అసమర్ధతా?
------------------------------
పొగడడం....
పొగిడించుకోడం
గోకడం తోనే-
గోకించుకునే కళ !!
---------------------------------
కాసుకో నా కవిత్వం
ఏరుకో ఓవిత్తనం
సమీక్షల చెద
కాబోదు వ్యధ....!!
----------------------------------
కవిత్వం నేను,
రాయలేను ఎలాగూ !
క్షమించండి
సమీక్షలు చేస్తా...!!
------------------------------------
నానీలు...!! > కవి:-డా.కె.ఎల్.వి.ప్రసాద్> హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి