మహా భాగవత పోతన మణిపూసలు :-.వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్,సిద్దిపేట.

ఉగ్ర వేళ రమించటం వలదు 
ధర్మాన్నీ విడిచి పెట్ట వలదు 
ఓ అరవిందాసనా... 
నిషిద వేళ సమంజసము కాదు         7831 

నీ మరిది ప్రేత భూమి యందును 
భయంకరపు  వాయువుల వల్లను 
రేగిన దుమ్ముతో కావి రంగు 
భాసిల్లె బస్వ  సువర్ణముగను    7832 

సూర్య చంద్ర అగ్నుల నేత్రాలు 
లేదును తనకు భేద భావాలు 
సర్వభూత సమబుద్ది కలవాడు 
హిత, మాన్య, అహితులు సామాన్యులు    7833 

నీకు మరిది నాకు సోదరుడు 
అని తలచకు హృదయమునెప్పుడు 
సమస్త లోకాలకు ప్రభువు 
దేవాది త్రి జగత్పావనుడు   7834 

ఈ శరీరము శాశ్వతము కానిది 
ఇహపరములకు దూరమవుతుంది 
నమ్మని వారు నిర్భాగ్యులు 
తెలుసుకోమని పలికె కశ్యపుడది      7835 

కాని దితి మన్మధ బాణములచే 
మనసుచెదిరి భర్తతోను అరిచే 
వినకుండ సిగ్గుతో పట్టుకొని 
ప్రాణేశ్వరున్ని తా కామించే      7836 

భార్య నిర్భంధమునకు లొంగెను
ఈశ్వరునకు దండంబు పెట్టెను 
నిజ కాంత సంగమం జేసీ 
బ్రహ్మ గాయత్రినీ జపించెను      7837 

నిషిద్ధ కర్మ స్థితికై 
దితియును 
సిగ్గు చిట్టాడగను మదిలోను 
పశుపతి వలన భయంబు గలిగి 
ప్రీతిన నానత వదన మగుచును     7838 

కశ్యపునితో దితియు నిట్లనియెను 
సమస్త భూపతి సర్వేశ్వరుడును 
నా అపరాధంబు సహించి 
మద్గర్భ పాలన చేయు మందును     7839 

శివరుద్రుండును మహాత్ముడును 
స్వయం ప్రకాశపు అలంఘ్యుడును 
సకలజన ఫల ప్రాపకుడు 
నిష్కామజన మోక్ష ప్రదుడును       7840

...........
కామెంట్‌లు