బ్రమ పడకండి !?:ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
భూమి పుట్టి భూమి లోపల పాతిపెట్టిన నీరు ఆకాశానికి కూడా చేరింది!?

ముక్కలు ముక్కలుగా విరిచిన చెట్టు మండితే కార్బన్ మొలిస్తే ఆక్సిజన్ అయినట్లు!?
నీరు విరిస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ కాక తప్పదు

అగ్నిపర్వతం మొత్తం ఒక రహస్య రసాయనిక క్రీడ పొంగితే పొగ విస్తరిస్తే బస్మం కాదు లోహాల అన్ని కలహాలే కారణం!?

భూ గర్భం ధరించింది ప్రసవించడానికి కాదు దాచిపెట్టడానికి!?


చిరుగుతున్న వస్త్రం వాతావరణం ఒక్కసారి నీవు పీల్చిన గాలి వేల సార్లు నీవు పేల్చిన తూటా లు!?

చల్లని కండరాలు మంచు కొండలు కరుగుతున్నాయి వయసు మీరిందనీ కాదు వ్యాయామం చేయలేదని కాదు వేడెక్కిన అన్యాయం కాలుదువ్విందనీ!?

వాలిని చంపినట్లు గాలి ని చంపిన రాముడు ఇప్పుడు అడవుల పాలు కాక తప్పదు !?


ఆవు పాలు తాగిన దూడలు కోట గోడలు నిర్మించి సామాజిక పులుల వేట ప్రారంభించినట్టు సమాచా…


కామెంట్‌లు