ఊపిరితిత్తుల వ్యాధులు - నివారణ.:- పి . కమలాకర్ రావు

 వర్షంలో తడిసినప్పుడు కొందరికి వెంటనే ఊపిరితిత్తులలో నిమ్ము చేరి దగ్గు జలుబు ఆయాసం మొదలవుతుంది. తడిబట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు.
 ఊపిరితిత్తులలో కఫం చేరి ఇబ్బంది పడుతుంది.
 ఎర్రని కాడలు కలిగిన గలిజేరు చెట్టు ఆకులు ( దీనిని అటుక మామిడి అంటారు ) కొన్ని తీసుకొని బాగా కడిగి తిప్పతీగ కాడల రసం  మరియు అతిమధురం పొడి నీరు కలిపి కాషాయంగా తయారుచేసి చల్లార్చి త్రాగాలి. కఫం తగ్గిపోతుంది. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
 కొన్ని తమలపాకులను ముక్కలుగా చేసి వాము కలిపి నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత త్రాగితే ఊపిరితిత్తులలోని నిమ్ము తగ్గిపోతుంది.
 తులసి ఆకుల కషాయం త్రాగినా ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గిపోతాయి
 అల్లం రసం ఉల్లిపాయ రసం కలిపి త్రాగితే ఉబ్బసం కూడా తగ్గిపోతుంది.
 మరిగించి చల్లార్చిన మంచి నీటిని మాత్రమే వాడాలి.
కామెంట్‌లు