*క్రూ కె డ్... కథ పై సమీక్ష*; రచయిత్రి... వంజారి రోహిణి;-సమీక్ష.... - డా. చిటికెన కిరణ్ కుమార్

  *ఆ.... చూపు మారాలి* ...
==============
 ఈ కథలో... నేను, నా  అంటూ కథను  చివరి వరకు కొనసాగించారు. నిజంగా మీ కళ్ళ ముందు జరిగిన, మీరు ఎదుర్కొన్న సంఘటన నా లేకా సమాజంలో ఈ విధంగా జరుగుతుందని రచన ద్వారా తెలియ చెప్పాలనుకున్నారా....!
     మొత్తానికి అయితే కథ నడిపించే  తీరును గమనిస్తే కళ్ళ ముందు జరిగిన  యదార్థ  కథనం గా ఉంది. (  నిజంగా అద్భుతం మీ ఆలోచన  )   సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న టువంటి  అంటే  ప్రదానంగా టీనేజ్ నుండి ముసలి వాళ్ళ వరకు ప్రధానమైన సమస్యను కథావస్తువుగా ఎంచుకుని కథ నడిపించే తీరు చాలా బాగుంది. కొన్ని విదేశాల్లో మహిళలు  కురచ దుస్తులు వేసుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా బయట తిరిగినా ఎవరి చూపు కూడా  వారిపై మల్లదు.  కానీ నేటి మన దేశంలో దాదాపుగా మహిళలు  నిండైన వస్త్ర ధారణ మరియు సాంప్రదాయంగా  ఉన్నప్పటికీ  కొందరి మృగాళ్ల చూపులు ఏ చోట నుండి ఏ అందం కనబడుతుందో....  అని చూసే దుర్మార్గ చూపు నేటికీ సమాజంలో కనబడుతూనే ఉంది.
       మార్పు కోసం, మరెందరో మందికి కనువిప్పు కోసం రాసిన ఈ కథ  దుర్మార్గులకు చెంపపెట్టు గా ఉందని భావిస్తూ...... మరిన్ని రచనలు మీ ద్వారా సాహితీ ప్రపంచంలో రావాలని కోరుకుంటూ.......

     సమీక్ష..
  *-డా. చిటికెన కిరణ్ కుమార్*
    కథా / వ్యాస రచయిత / 
     సెల్. 9490841284

కామెంట్‌లు