బాలల ప్రతిన(బాలగేయం);----గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
మొక్కలై బ్రతుకునిస్తాము
అక్కలై ఆదరిస్తాము
చక్కనైన  దారిల్లో
చుక్కలై వెలుగునిస్తాము

తరువులై ఫలములిస్తాము
కరువులను తరిమికొడుతాము
పరువుకలిగి జీవిస్తాము
గురువులై జ్ఞానమిస్తాము

అమ్మలా  సేవచేస్తాము
బొమ్మలై మోదమిస్తాము
కొమ్మపై కోకిలమ్మ లై
కమ్మగా ఆలపిస్తాము

నీతితో నడచుకుంటాము
ప్రీతితో  సహకరిస్తాము
ఖ్యాతి నొసగే పనులతో
జాతి గౌరవం నిలుపెదము


కామెంట్‌లు