స్వేచ్ఛా జీవి......?!:-' రసస్రవంతి ' & ' కావ్యసుధ '( కవి ద్వయం : హైదరాబాదు

 వాడు స్వతంత్రుడు
వాడికి బాధ్యతలు బంధాలు
అనుబంధాలు, ఆత్మీయులు
ఎవ్వరూ లేని వాడు
ఎవరికీ ఏమీ కాని వాడు
మందలించే వారు లేరు
మద్దతునిచ్చే వారు లేరు
ఎవరి మద్దతు వాడికి
అవసరమూ లేదు 
లోకంలో ఏం జరుగుతుందో
వాడికి అక్కర లేదు !
మేడలు మిద్దెలు అవసరంలేదు
వాడికి అవసరం లేదు నివాసం
తను నిద్రించిన స్థలమే కైలాసం
వాడికి రాజకీయాలు తెలియవు
రంకు బొంకు వాడికి  తెలియదు
ఊసరవెల్లిలా రంగులు మారడు  
ఎక్కడికైనా వెళ్తాడు
వాడికి తోచింది చేస్తాడు
వాడు స్వతంత్రుడు
తుషార బిందువులకు
మురువడు 
తుఫాను వచ్చినా జడవడు
సునామీలు వచ్చిన భయపడడు
అదొక ప్రకృతి ప్రళయం
అనుకుంటాడు
వాడి లోకం వాడిదే.
స్వేచ్ఛగా తిరుగుతాడు
కుల మత భేదాలు వాడికి తెలియవు
కష్టసుఖాలు వాడికి తెలియవు
ఏ అమ్మ ఇంత అన్నం పెడుతుందో
ఆశగా ఎదురు చూస్తాడు 
ఎప్పుడు కడుపు నిండుతుందో
ఇదే వాడి నిరంతర ఆలోచన
వాడి పొట్ట నిండితే చాలు
వాడు బిచ్చగాడు  స్వతంత్రుడు.
స్వేచ్ఛా జీవి.
 
కామెంట్‌లు