*వివాహబంధము**( మణిపూసలు)*; - మిట్టపల్లి పరశురాములు
పెళ్ళి నూరేళ్ళ పంట!
చిలక గోరెంక జంట!
కలహాల కాపురమైతె!
చెలరేగునగ్నిమంట!!

వివాహమను బంధము!
పవిత్రమగు బంధము!!
ఏడడుగులువేసిముందు
నడువుజీవితాంతము!!

మూడుముళ్ళబంధము!
ముదముగొలుపుచందము
ఆలుమగలకలిపేటి!
వీడనిఅనుబంధము!!
             ***

కామెంట్‌లు