మంచి మిత్రులు - బాలల కథ : -ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 ఒక చెట్టుతొర్రలో రామ చిలకల జంట కాపురం వుండేది.చిలకమ్మ రెండు గుడ్లు పెట్టడం తో వాటికి కాపలా గా ఉంటూ అవి ఆహారం సరిగా లేక నీరసం తో ఉన్నాయి. 
   ఇలా ఉండగా మగచిలక ఒక రోజు బైట కెళ్ళి తుఫాను లో చిక్కుకొని గాయపడి దూరప్రాంతం లో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ దానికి తన భార్య ఎలా ఉందో అని చాలా బాధగా ఉంది.ఒక చెట్టు మీద ఉన్న గుడ్ల గూబ కొత్తగా వచ్చిన చిలకతో స్నేహం గా మాట్లాడటం చేస్తుంది. దాంతో మగచిలక తన భార్య గురించి గుడ్లగూబ కు చెప్పి "ఈ గాయాలు తగ్గే వరకు నేను ఎగరలేను. అంత దూరం వెళ్లలేను. మా గూడు దగ్గరలో ఒక ఇల్లు ఉంది. అక్కడ ఒక పిల్లి ఎలాగైనా మా కూనలను చంపి తినొచ్చు. నువ్వు నాకేమైనా సాయం చెయ్యాలి. !"అని వేడుకుంది.
"నేను ముసలి దాన్నే అయినా రెక్కలు సత్తువ ఉంది. రాత్రి కి ప్రయత్నం చేసి నువ్వుండే చోటుకి వెళ్లి చూస్తాను. ఆనవాళ్లు గట్టిగా చెప్పు మరి.? "అని గుడ్లగూబ అడిగింది. 
   ఉత్తరం దిక్కులో గాలిమరలు ఉన్నాయి. అక్కడ చేల మధ్య కొన్ని ఇళ్ళు, ఒక విరిగిన కొబ్బరిచెట్టు ఉన్నాయి. ఆ చెట్టు తొర్ర లోనే మేము ఉండేది. "అన్నాడు చిలకయ్య. 
      సరే అని రాత్రికి గుడ్ల గూబ వెతుక్కుంటూ వెళ్లి చెట్టు తొర్ర దగ్గరికి పొతే గుడ్లు పొదిగే  చిలకమ్మ కెవ్వు మని అరచి వణికిపోతుందేమో నా వికారపు మొహం చూసి, అనుకున్న గుడ్లగూబ కొన్నిచిన్న  పండ్లు సేకరించి అప్పుడప్పుడు చటుక్కున ముక్కలు చెట్టు తొర్ర లో వేయసాగింది. చిలకమ్మ ముందు భయపడినా ఆకలి తో ఆ పండ్ల ముక్కలు తిని హాయిగా ఉంది. తర్వాత పరిచయం చేసుకొని గుడ్లగూబ పక్షి కూనలకు కాపలా ఉండి, చిలకమ్మ ను లార్వా ల కోసం బైట కు పంపింది. ఆ సమయం లో వచ్చింది గండు పిల్లి. చెట్టెక్కి తొర్ర లో కి చూడగానే వికారంగా ఉన్న గుడ్ల గూబ "రేయ్ చంపుతా !"అని కేక పెట్టేసరికి జడుసు కొని పారిపోయింది పిల్లి! రెండ్రోజులకి మగ చిలక తిరిగి వచ్చి మిత్రునికి కృతజ్ఞతలు చెప్పి దగ్గరలో మరో నివాసం చూపి తోటలున్నాయి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని కోరింది. అలా అవి మంచి మిత్రులయిపోయాయి!!
   (సమాప్తం )
నీతి---తాను  ఆపదలో ఉన్నపుడు తెలివిగా సాయం కోరాలి. ఇతరులు ఆపదలో ఉంటే సాయం చెయ్యాలి. 

కామెంట్‌లు