అక్షర మాల - బాల గేయాలు (క గుణింతము ):-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
కల్లమాట లాడరాదు 
కాకర కాయలు చేదు  
కిటికీ నుండి  గాలి అందు
కీరా మంచిది  వేసవి యందు!

కుర్చీ ఎక్కి బూజుదులుపు 
కూరలు పండ్లు కడిగి చూపు
కృష్ణ లీలలు మనోహరo 
కౄరమృగాలకు ఉండు దూరం!

కెరటాలు మనకు ఆదర్శం 
కేకలు వేయకు నిశ్శబ్దo 
కైక వరాలు లోకరక్షణకే 

కొడుకు కూతురు సమానమే 
కోపం వదిలిన మంచిజరుగును 
కౌసల్య సుతుడు శ్రీరాముడు 
కంచె ఉండాలి తోటలకు!!


కామెంట్‌లు