మోహిని రూపము;-మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
 సీస పద్యం
పాలకడలి జిల్కి పరవళ్ళు తొక్కగ
      నమృతము వచ్చెను నద్భుతముగ,
దేవదానవులను దీటుగ వరుసలో
   ‌     కూర్చుండబెట్టి యు కూరిమితోడ    
శ్రీమహావిష్ణువే శీఘ్రముగా తాను
        మోహిని రూపమూ మోదమొంద,
ధరించినమృతము తాగించే సురులకు
       ముచ్చట గొల్పుచు మోహ పరచి,
తేటగీతి
యసురు లందరు సురతాగి యధములగుచు,
నాటలాడుచు మరిచిరి బోటినిగని,
వగలు జూపించి మోహిని వంచుచుండ,
దేవతలు నమృతము తాగి తృప్తిబడిరి.


కామెంట్‌లు