డా. చిటికెనకు ఫ్లవ నామ వాసంతి పురస్కారం జోర్దార్ తెలుగు దినపత్రిక  ఆధ్వర్యంలో   " ఫ్లవ నామ వాసంతి " పేరుతో  ( శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది కవితా కవితా సంకలనం ) ను ప్రచురించిన  దానిలో  వివిధ రాష్ట్రాలకు చెందిన  రచయితలు పాల్గొని ప్రతిభ కనపరిచిన  వారికి  పురస్కారాలను అందుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కథా/వ్యాస రచయిత, ఇంటర్నేషనల్ బెనివోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు *ఉత్తమ సాహితీవేత్త* 2021  పురస్కారాన్ని ప్రదానం చేశారు .. ఈ సందర్భంగా  జోర్దార్, పరిమళం దిన పత్రికల సంపాదకులు రావుల రాజేశం మాట్లాడుతూ సాహితీ ప్రపంచంలో డాక్టర్ చిటికెన రచనలు ఈ సమాజాన్ని మేల్కొలుపుటకు ఎంతో అవసరం ఉన్నదని, ముందు ముందు ఇలాంటి రచనల ద్వారా తను   విస్తృత స్థాయిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  ఆశిస్తూ డాక్టర్ చిటికెన ను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా కవులు,  రచయితలు  పురస్కారం అందుకున్నందుకు  డా. చిటికెన ను  ప్రశంసించారు.


కామెంట్‌లు