హ" గుణింత గేయం:--- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 హలోయని  పలుకరించుము
హాయిగా జీవించుము
హితము  కోరుచుందుము
హీన పనులు మానుము
హుళక్కి మాటలు మానుము
హూణులను తరిమివేసాము
హృద్యముగా మాటాడుము
"హౄ"  ను ఉచ్చరించుము
హెచ్చుతగ్గులు యెరుగుము
హేరంబుడిని  సేవించుము
హైమావతి నీ వేడుదము
హొయలు మాకు వలదని
హోలీ మనము ఆడెదము
హౌరా బ్రిడ్జి తెలుసా మీకు
హంస రహస్యం యెరగాలి.

కామెంట్‌లు