గెలుపు: -ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
గెలుపు బాటలో నీవుంటే
ప్రశంసలే వస్తాయి!!
కానీ ప్రతిభా బాటలో నీవుంటే
ఓటములు రావచ్చు
కానీ ప్రతిభాపాటవాలు
ప్రపంచానికి తెలుస్తాయి!?


గెలవాలి అనుకున్నప్పుడు
ఏదైనా నా ఒక్క దాన్ని ఎన్నుకో
నిన్ను విజేత అంటారు!?
కానీ
తెలుసుకోవాలి అనుకున్నప్పుడు
అన్నిటినీ ఎన్నుకో
నిన్ను విజ్ఞాని అంటారు!?

ఆసక్తి అభిరుచి
నీకు ప్రతిజ్ఞ లాంటిది!!
నీ నైపుణ్యం అనుభవం
ప్రజ్ఞ లాంటిది!!
ఓడిన గెలిచిన ఒకటి!?

అంతరంగం లో
ఆత్మవిశ్వాసం
రంగస్థలంపై విశ్వాసాన్ని ఇస్తుంది!?
అంతరాత్మ గురించి గతం గురించి ఆలోచిస్తే
చింత మిగులుతుంది!?

గెలుపే కావాలనుకుంటే
ఆట గురించి కాదు
ఆటగాళ్ల గురించి తెలుసుకో!?
ఆటలో గెలవాలనుకుంటే
ఆట గురించి తెలుసుకో!?

నిన్ను నీవు గెలిస్తే
ప్రపంచంతో పనిలేదు!?
ప్రపంచం తో గెలిస్తే మాత్రం
నీతో ప్రపంచానికి పని పడుతుంది!?

గెలిచినవాడీ పాఠాల్లో
అహంకారం ఉంటుంది!?
ఓడిన వాడి పాఠాల్లో గుణపాఠం ఉంటుంది
సుగుణం ఉంటుంది!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem,8309529273

కామెంట్‌లు