శ్రీ మహాభాగవత పోతన మణిపూసలు :-...వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.

గృహస్థు సర్వాశ్రమ వాసులను 
నిజాశ్రయంబునను రక్షించును 
తానును కూడ తరించుచు 
భార్య పురుషునిలోను సగంబును        7826 

ఇతరాశ్రమ వాసులు జయంపను 
లేనట్టి ఇంద్రియ శత్రువులను 
భార్య సమేతుడైన గృహస్థు 
లీలా మాత్రంగా జయించును      7827 

మహోపకారిణి భార్య ఋణములను 
తీర్చగలేరు గుణ సత్పురుషులును 
మాలాంటి వారికి కష్టము మనస్సున
 దుఃఖము వదులుమనెను    7828 

ఓ తరాళ లోచన........ 

సంతానము కై వచ్చితివి 
ఉత్తమ కులపు శీలవతివి 
నీ కోరిక తీర్చుట నా బాధ్యత 
భర్తగ నేను చేయనలవి 7829 

తరుణీ! ఒక్క ముహుర్తమాగుము  
పనికి రాదుగ సంధ్యాకాలము 
కామ శత్రువు శంకరుడు 
సంచరించుతాను సాయంత్రము      7830 

కామెంట్‌లు