సు (నంద) భాషితం-- సహనం-- సునంద వురిమళ్ల, ఖమ్మం
 సహనం శాంతి ధర్మ రూపం.
సహనం విజయానికి సోపానం.
సహనం వహించడం చాలా సార్లు కష్టమైనదే. ఎందుకంటే  కయ్యానికి కాలు దువ్వి  మనో క్లేశానికి గురి చేసేవారు చాలా మంది తారస పడుతుంటారు. అలాంటప్పుడే మనం వహించే సహనం ఎదుటి వారికి చేతగాని తనంగా కనిపించ వచ్చు. 
కానీ దాని ఫలితం మనకు అంతులేని ఆత్మ తృప్తిని ఇస్తుంది.
మనో తేజస్సును ప్రతిఫలింపజేస్తుంది.
ఎదుటి వారిలో కదలిక తెచ్చి ఆత్మశోధనకు పురికొల్పుతుంది.
 ఉషోదయ నమస్సులతో


కామెంట్‌లు