స్వచ్ఛమైన నువ్వు;-లతా శ్రీ-పుంగనూరు
ఎంత స్వచ్ఛమైన నువ్వు
పుడమితల్లి ఒడిని ఓలలాడినందుకా?

ఎంత నిర్మలమైన అందం
ముత్యాలను తలపించే పలువరుస నీదనా?
మల్లె,విరిజాజి తలనముడవకపోయినా
మకరందం చిందించే నవ్వు నీ సొంతమనా?

నగలు,నాణ్యాలు, బంగారం లేకపోయినా
ప్రకృతి ఒడిలో పులకించే సంపద నీదనా?
ఓ లతాంగి పెద్దధనవంతులైన నీ కన్నా 
పేద వారే అని చమత్కరించుట  లేదుకదా?

జీవితం అందంగా ఉండడానికి
ఆనందంగా గడపడానికి డబ్బు,దస్కం
కారణం కాదని తెలిపే నీ దరహాసం
ఆలోచింపచేసే నా నేటి సమాజానికి

పెద్దచదువులు,హోదా, సంపద,పేరు
ప్రతిష్టే జీవితధేయం ,మట్టి వాసన
పడని,నేటి సమాజానికి నీ సోయగం
నిజమైన ఆనందం తెలుపుతున్నదా?

వంటినిండా బురదనిండిన వనిత
అందంగా కనపడడం ఏమిటో?
మనబుద్ధిని వికసింప చేసేనా?
జాతిని జాగృతం చేసేనా?
ఆనందం మనలో ఉందని తెలిపే నా?
పడతి అందం అందమైన నవ్వని
ఇకనైనా తెలిసేనా?నవసమాజానికి.కామెంట్‌లు