పచ్చని చేమంతి : -లతాశ్రీ--పుంగనూరు
 పసుపు పచ్చని చామంతి
చిన్ని రేకులు పూబంతి
ఎన్నిరంగులలొ నువ్వున్న
పసుపు రంగు నీకు మిన్నంట
అమ్మ వారి అలంకరణలో
భవాని మాత పూజలో
నీదే అందెవేసిన చెయ్యంటా
అందుకే నాకు ఇష్టం నువ్వంటా

కామెంట్‌లు