*పూలబతుకమ్మ* *(మణిపూసలు)*; మిట్టపల్లి పరుశురాములు
నిద్దుర వదిలి కన్నయ్య
పొద్దున లేచాడన్నయ్యా
అడవి బాట పట్టి నాడు
పూలకైవెదికాడయ్య

అక్క చెల్లి కలిశారు
రంగుల పూలుతెచ్చారు
బతుకమ్మ చక్కగపేర్చి
చప్పట్లు కొట్టి ఆడారు

కొండ కోన తిరిగారు
గునుగు తంగేడు తెచ్చారు
చక్కగా బతుకమ్మ దిద్ది
బతుకుమ్మపాటపాడారు

బతుకమ్మ ముస్తాబు చేశారు
చెరువువద్ద ఆడినారు
నిండుగనుదీవించుమని
కొలనులోవేసివచ్చారు


కామెంట్‌లు