అరిపిరాల తారావళి; - రామ్మోహన్ రావు తుమ్మూరి

 6
ఎలగందుల తుది ప్రతినిధి
నెలవుగ తనపేర ఊరు నేర్పడజేయన్
అలనాటి అరిపిరాలయె
పిలువ కరీంనగరమయ్యె పిమ్మట గనినన్
7
నైజాము రాష్ట్రమందున
రాజా కిషను ప్రసాదు రాచందమునన్
ఈ జిల్లా రూపొందెను
మోజుగ జిల్లాకు కేంద్ర మొనసెను యపుడే
8
పందొమ్మిది వందల ఐ
దందున ఇది కేంద్ర్రమయ్యె అప్పటి నుండె
ల్గందల ప్రాభవముడిగెను
పొందెకరీం నగరు పేరు పొక్కెను దిశలన్
9
ముగిసె నిజాములపాలన
ఎగయగ భారత పతాకమెర్రని కోటన్
భుగభుగలణగగ మెల్లగ
నిగనిగలాడుట మొదలయె నీ ప్రాంతమునన్
10
వెలిసెను విద్యాలయములు
మొలిచె కచేరీలు పాత మొగసాలలలో
వలసిన అంగడులాపై
నిలిచెను బస్సుల నిలయము నిండగు శోభన్
కామెంట్‌లు