గాంధీజీ దేశానికి మహాత్ముడు( బాల గేయం)-ఎడ్ల లక్ష్మి--సిద్ధిపేట

 ఒక వ్యక్తి ఒక పోరాటం
       ఒక దేశం
అది ఎవరు? ఎవరు?
         గాంధీజీ
అందరి ఆత్మీయుడు 
           అతడే
ఆయుధము లేని యుద్ధము
              చేసే
శాంతియుత సైనికుడు
             అతడే
రక్తము చిందించ కుండా
         రణము చేసే
రక్షణ వలయుడు అతడే
           అతడే
సత్యం దర్మమనే ఆయుధం
             చేతబట్టి
దేశాన్ని గెలిచిన వాడు గాంధీ
              ఒక్కడే
అహింసతో కొత్త మార్గాలు
             చూపుతూ
శాంతి యుతంగా అడుగులు
          ముందుకేసి
అందరిలో ధైర్యము నింపాడు
              మహాత్ముడు
గాంధీ చూపిన బాటలో ఎందరో
            నడిచారు
ఆ భాట మన దేశ పౌరులకు
             పూల బాట
అతడి మాటలకు ఎందరో
      ప్రభావితులయ్యారు
శాంతియుతంగా పోరాడినా
            శాంతి పరుడు
చొక్కా లేని గాంధీ ఎంత
            చక్కనోడు
శాంతి ధర్మం అనే ఆయుధాలతో
             గాంధీ జీ
భారత దేశ  స్వాతంత్ర్యం తెచ్చిడు
       ఆ మహానుభావుని కి
జోహార్ జోహార్ జోహార్లు

కామెంట్‌లు