రాణి గారి కథలు పుస్తకావిష్కరణ

 పిల్లలు బాల్యంలోనే కథలను చదవడం ద్వారా వారు భాద్యతా యుతమైన పౌరులుగా తీర్చి దిద్దబడుతారని చిత్తూరు జిల్లా కార్వేటినగరం డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్. విజయులు రెడ్డి చెప్పారు. 8/10/2021 న డైట్ కాలేజీలో ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన పిల్లల పుస్తకం “రాణి గారి కథలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఉపాధ్యాయులు,తల్లి తండ్రులు పిల్లల చేత కథలను చదివే అలవాటును చిన్నప్పటినుంచే  చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలకు కథలు చెబుతూ పాటాలు చెబితే వారు మరింతగా చదువు పైన దృష్టి కేంద్రీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
చిన్న పిల్లలప్పుడు ఏవైతే వారి మనసులో నాటబడుతాయో అవి పెద్దయ్యాక కూడా ఆచరిస్తారు. కాబట్టి బాల్యంలోనే వారికి కథల ద్వారా మంచి విషయాలను భోదించాలని డైట్ ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ ఏ.వజ్రవేలు రెడ్డి కోరారు.
పుస్తక సమీక్ష చేసిన కథా రచయిత పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ పిల్లల్ని మొబైల్లకు దూరంగా ఉంచాలన్నారు. వారానికొక రోజు ‘నో మొబైల్ డే’ లాంటివి ప్రకటించి మనసు విప్పుకుని మాట్లాడే రోజులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల కథలు చిన్నవిగా  ఉంటే కూడా పిల్లలు ఎక్కువ ఇష్ట పది చదువుతారని, చిన్ని కథలు విరివిగా రాయాలని బాల సాహితీ వేత్తలను ఆయన కోరారు.
ఆల్ ఇండియా రేడియో విశ్రాంత సంచాలకులు ఏ.మల్లేశ్వర రావు, డైట్ జిల్లా రిసోర్స్ యూనిట్ అధికారి డాక్టర్ టి.రాజ శేఖర రెడ్డి, తెలుగు లెక్చరర్ సి.దశరధుడు,రచయితలు పేట యుగంధర్, మూరిసేట్టి గోవింద్, ఓట్ర ప్రకాశ రావు, అధ్యాపక బృందం, టీచర్ ట్రైనీలు హాజరయ్యారు.
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
9393662821
PHOTO DETAILS:
చిత్తూరు జిల్లా కార్వేటి నగరం డైట్ కళాశాలలో 8/10/2021 న ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన రాణి గారి కథలు, బాలల బొమ్మల కథల పుస్తకం ఆవిష్కరింపబడింది. ఫోటోలో వరుసగా  రచయితలు ఓట్ర ప్రకాశ రావు , మూరిశెట్టి గోవింద్, ఆర్ సి కృష్ణ స్వామి రాజు, పిళ్ళా కుమార స్వామి, డైట్ ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ ఏ.వజ్రవేలు రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విజయులు రెడ్డి, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఏ.మల్లేశ్వర రావు, డైట్ అధ్యాపకులు టి.రాజశేఖర రెడ్డి, సి.దశరధుడు ఉన్నారు.

కామెంట్‌లు