చదువు కొలువు!; -డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.చదువు జపం!
   చదువు తపం!
   చదువు  వరం!
   చదువు గుణం!
2,భాస్కరవెలుగు పగలే!
జ్ఞానభాస్కరుడు సదా వెలుగు!
  సమస్యలమూలం అజ్ఞానమే!
జ్ఞానమే శక్తి!
జ్ఞానమే ఆయుధం!
3.అన్నీఉన్నా చదువులేకున్న!
    బతుకువెల  వెలవెల!
   చదువొక్కటి ఉంటే చాలదా!
   కల్పతరువు, కామధేనువు!
4.ఏకాగ్రతే చదువు!
   అది విముక్తి మార్గం!
   ఘనవిజయసూత్రం!
   జీవనపరమసాఫల్యం!
5.విద్య వినయం!
   వినయం యోగ్యత!
   యోగ్యత ధర్మాచరణ!
   ధర్మాచరణ ధనప్రాప్తి!
   ఆ ధనమే సుఖకారకం!
6.అమ్మా! చదువులతల్లీ!
    మొర ఆలకించు!
    "ఖాళి" గా ఉంచకు!
    "కాళిదాసుల్ని" చేయి!
    "మూగనోట" మాటనీయి!
   జనమంతటికి, జగమంతా,
  విద్యాయోగం అనుగ్రహించు!
----------------------------------------
ఈరోజు సరస్వతి అవతారం,
శుభాకాంక్షలు అందిస్తూ,
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
కామెంట్‌లు