వెన్నెల శోభితం:-నెల్లుట్ల సునీత-కలం పేరు శ్రీరామ

చిరునవ్వే మనకు వరమవ్వు
కోట్లాది హృదయాలను కదిలించు
భాషకు అందని భావము
చూడచక్కని తెలుగు సున్నితంబు.!

ఆత్మీయ స్నేహమై పలకరించు
మనసుకు మనసు ముడిపడు
బంధాలు దృఢంగా నిలబడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.!

సమస్త రోగాలకు దివ్యౌషధం
సమస్యలకు స్వస్తి పలికే
పెదాలపై కదిలే చిరునవ్వు
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

స్వచ్ఛమైన మనసుకు ప్రతిరూపం
చిరునవ్వే విజయ సంకేతం
ఆనందం ఆరోగ్యానికి ఆలంబన
చూడచక్కని తెలుగు సున్నితంబు.!

పరిచయాల పలకరింపుకు ప్రతీక
ముఖవర్చస్సుకు  పెట్టని ఆభరణం
ప్రశాంత వెన్నెల శోభితం
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

కామెంట్‌లు