రుబాయీలు (తొలి ప్రయత్నం ):-ఎం. వి. ఉమాదేవి

 1)
తూర్పుతిరిగి మొక్కుతాను ఆశనయ్యి మిగిలినపుడు 
పడమరలో చెక్కుతాను శిలనుఅయ్యి మిగిలినపుడు 
కోరికలను  కన్నీరుగ పరుచుకున్న మేఘమల్లె 
దక్షిణాన మెరుస్తాను  దక్షతయ్యి మిగిలినపుడు !
2)
అందరిపై నమ్మకాన్ని అలవాటుగ పెంచుకోకు 
కొందరిచ్చె  భరోసాను గ్రహపాటుగ తుంచుకోకు 
రెక్కలు కూలిన పక్షిగ మిగలలేదులే ఉమ ఇక 
కలిచివేసె  గతమేదో పొరబాటుగ ఉంచుకోకు !

కామెంట్‌లు