పిల్లలు :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

చిన్నారి పిల్లలు 
బంగారు కొండలు 
ముద్దుల మూటలు 
చిరునవ్వుల తోటలు 

ఉత్సాహ ప్రతీకలు 
ఉరుకులు పరుగులు
పొంగే జలపాతాలు 
సాగేటి సూర్యులు

పిల్లలతో మాటలు
పిల్లలతో ఆటలు 
చూపునెన్నొ మార్గాలు
అదే నెన్నొ విజయాలు
కామెంట్‌లు