చందవరదాయీ! అచ్యుతుని రాజ్యశ్రీ


కేవలం రాజపుత్రులు రాణాలు మహారాజులేకాదు  సామాన్య ప్రజలుకూడా దేశభక్తి రాజభక్తి  కలిగి ఉండేవారు. ఇక ఆకాలంలో ఆస్థానంలోని కవులు రాజభక్తి కలిగి ఆయనతో పాటు యుద్ధరంగం లో కూడా ఉండేవారని చరిత్ర చెప్తోంది. వారిని చారణకవులు అనేవారు.తమప్రభువు గుణగణాలు శౌర్యప్రతాపాలను  కీర్తిస్తూ  కవితలల్లుతూ ప్రజల్లో ఉత్సాహం చైతన్యం రగిల్చేవారు.రాజు కి జయగీతాలు పాడుతూ  ఆయన క్షేమం కాంక్షించేవారు.అలాంటి వారిలో పృధ్వీరాజు చౌహాన్ కి

అన్నివిధాలా తోడునీడగా ఉన్న 

అతని చారణకవి చందవరదాయీ ని గూర్చి  తెలుసు కుని తీరాలి. మహ్మద్ ఘోరీ మనదేశం పై దండెత్తి  పృధ్వీరాజు చేతిలో ఓడాడు.తన చేతికి చిక్కిన ఘోరీని  పృధ్వీ క్షమించి వదిలేయటమే ఒక విషాద ఘట్టం. తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డబేరంఐంది. కరుడుగట్టిన ఆ ముష్కరుడు  పృధ్వీరాజు ని చెరలోవేసి కనుగుడ్లు పీకించిన పిశాచి.చందవరదాయీ  తన…

ఇలా ఘోరీని బాగా రెచ్చగొట్టాడు.అంధుడైన పృధ్వీరాజు  చాతుర్యం చూడాలని ఘోరీకి అనిపించింది. చందవరదాయీ  చాలాసేపు దర్బార్ లో  వివిధ ప్రాంతాలలో  మూలమూలల్లో శబ్దం చేయటం ఆదిక్కుగా పృధ్వీ బాణాలు వేయటంతో అంతామంత్రముగ్ధులైపోయారు.ఘోరీతో సహా అంతా వినోదం లోపూర్తిగా మునిగి పోయారు.సమయంచూసి ఘోరీ వైపు  చందవరదాయీ శబ్దం చేయటం  కనురెప్పపాటులో ఆదుష్టుని తల తెగి కింద పడింది. వెంటనే  చందా తన చేతి కత్తితో పృధ్వీరాజు ని పొడిచి చంపి  అదే కత్తితో తనను తాను పొడుచుకుని  ప్రాణంవిడిచిన రాజభక్తి  ప్రదర్శించిన చందవరదాయీ  చరిత్రలో  హిందీ సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయాడు.మరి నేడు మన సరిహద్దుల్లో టెర్రరిస్టుల ఆగడాలు మన సైనికుల పోరాటం వారు అమరులవటం  చూస్తున్నాము.వారి త్యాగాల వల్లనే మనం భద్రంగా ఉన్నాము.మన మధ్య తిరుగాడే దుర్మార్గులు  దేశద్రోహులను గుర్తించి  దేశ రక్షణకు తోడ్పడటం మనవిధి కర్తవ్యం సుమా!


కామెంట్‌లు