ఇరుగుపొరుగును పోల్చుకుని
గుండెను బరువు చేసుకునే
ఇల్లాండ్రు...
అనుక్షణం అసూయ ద్వేషాలతో
కుమిలే మనస్థత్వాలు
పోందలేరు ఆనందం ఈ జగతిలో
తృప్తి ని మించిన ధనం లేదు ఇలలో
తెలియక వగచే జనులెందరో ...!
కలహాలకు కారణం ఉండక
కనకం అంటె ప్రాణం పెట్టె హృదయాలు
ప్రేమ పుష్పం మొగ్గలోనే తెంపి
అనురాగ పరిమళాలు ఆస్వాదించని మనసులు
ఓర్వలేని మనసుల వింత ప్రవర్తనలు...!
హృదిని చింద్రం చేస్తూ
ఆర్థిక లెక్కల గణనతో
మమకారం వికారం కలిగిస్తూ
పరుష పదజాల ప్రయోగాలు లలనామణుల వింత పోకడలు...!
సముదాయించినా లొంగక
బ్రతుకు గంగపాలు చేస్తూ
గగనానికి నిచ్చెన వేస్తూ
ఆశల ఆరాటంలో
నేలను మరచి
హరితానందాన్ని విడిచి
ఎడారి వైపు నయనాలు...!
పదాల వెన్నెల్లో
చల్లని హాయిని అందించి
ఎదను ఊయలలూపిన
ఈ పాట
అనుభూతి అక్షరాల పూదోట...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి