కుక్క- మాంసం ముక్క(బాల గేయం-)- వురిమళ్ల సునంద, ఖమ్మం

 అనగనగా ఒక ఊరిలో
శునకమొకటి ఉండెను
మాంసం కొట్టు వద్ద చేరి
కాపలా కాస్తూ ఉండెను
అది చూసిన యజమానికి
ఎంతో సంతోషము కలిగి
మాంసం ముక్కా ఎముక
రెండింటిని కుక్కకు ఇచ్చెను
అవి పట్టుకొని పోతుండగా
కాలువొకటి అడ్డమొచ్చెను
నీటిలోన నీడను చూసి
వేరే కుక్కని ఊహించెను
పైకాళ్ళతో మాంసం ముక్క
ఎంతో ఒడుపుగా పట్టుకొని
ఎముకనొక్కటే నీటిలోన
నెమ్మదిగా జార విడిచెను
ఆపై ఓ చెట్టు కిందకు చేరి
ముక్కను  సంబురంగ తీసి 
ఆనందంగ నమిలి మింగెను

కామెంట్‌లు