ఎఎస్ఐ.తొగర్ల సురేష్ సేవా నిరతి


 బోధన్.:-సేవ భావం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి అప్పుడే పేదవాడు సంతోషంగా ఉంటూ వారిచ్చే ఆశీర్వచనమే మనకు రక్షణగా,పుణ్యఫలితమనేది కలుగుతాయి.నోరు  బాగుంటే ఊరు బాగుంటది అనేది పెద్దల మాట..ఊరికెనే పోదు..ఎదో ఒక రూపంలో మనకు తోచిన సహాయం చేసే అలవాటు ఉండాలి,మీ స్థాయిని బట్టి ముందుకెళ్లాలి. బోధన్ డివిజన్ లోని వర్ని మండల పోలీస్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎఎస్ఐ.తొగర్ల సురేష్ కూడా తనకు తోచిన విధంగా స్తోమతను బట్టి మానవత దృక్పథంతో ఉడుత భక్తి సహాయాన్ని అందిస్తూన్నారు.కరోనా వైరస్ నియంత్రణలో లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడుతు న్నారు.అటువంటి వారికి సహాయాన్ని అందిం చేందుకు ఇందూరు యువత అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవ కార్యక్రమానికి తోగర్ల సురేష్ 25 కిలోల రైస్ బ్యాగ్ కి సంబంధించిన నగదును అందించారు.ఈ సందర్భంగా ఆయన సహాయానికి అభినందిస్తున్నారు.


కామెంట్‌లు