గొప్ప మనసులు-చేతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 
1.జైహింద్ నినాదంతో కొదమసింగంలా బైట దేశం నించి పోరాటం చేసిన  సుభాష్ చంద్రబోస్  బాల్యంలో  తల్లి దగ్గర పడుకొనేవాడు.ఒకరోజు అర్థరాత్రి ఠక్కున లేచి నేలపైపడుకుంటే మెలుకువ వచ్చి అమ్మ కారణం అడిగింది."మా మాష్టారు చెప్పారమ్మా మన ఋషులు మునులు నేలపై పవళించి ఎంతో పవిత్ర జీవితం గడిపారు ట.నేను అలా సన్యాసిని  కావాలనుకుంటున్నాను.ఇప్పటి నించి కఠిన క్రమశిక్షణ తో ఉండాలి అనుకుంటున్నా. "అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు "ఒరేబాబూ!కేవలం నేలపై పడుకోటంకాదు.సేవాభావం అంత సత్తా కలిగి దృఢసంకల్పంతో ఉండాలి. ""నాన్నా!నేను భారత మాత సేవకే అంకితమవుతాను.ఐ.సి.ఎస్.మీద మోజులేదు."అదే ఆచరణలో పెట్టాడు. మనం బాల్యంలోనే కొన్ని లక్ష్యాలు పెట్టుకొని చదువులో రాణిస్తూ లక్ష్యం చేరాలి.2.అమెరికా లో స్వామి వివేకానంద ఒక మహిళ ఇంట్లో ఉన్నాడు. కానీ తన వంట తనే చేసుకున్నాడు. ఆయన దగ్గరకు రోజు బోలెడంత మంది పిల్లలు వచ్చి  పిచ్చాపాటీ మాట్లాడేవారు.ఆరోజు వివేకానంద వంటచేసుకుని అన్నంతినబోతుండగా బాగా ఆకలితో ఉన్న పిల్లలు వచ్చారు.తన దగ్గర ఉన్న బ్రెడ్  వంటకాలు అన్నీ వారికి  పంచాడు.అప్పుడు ఆ అమెరికన్ స్త్రీ అడిగింది "నీవు ఏంతింటావు? వండుకున్నది వారికి పంచావు?" "అమ్మా!ఆపసివారంతా ఆకలితో నకనక లాడుతున్నారు.వారికి పెట్టకుండా నాకడుపు ఎలా నింపుకోగలను?వారు తినటంతో నాపొట్ట నిండిపోయింది."బడిలోకానీ ఇంట్లో కానీ మనంతినేప్పుడు కొంత  అవతలివారికి పెట్టాలి.లంచ్ బాక్స్ లో వివిధ రకాల  వంటకాలు తినుబండారాలు బడిలో పిల్లలు పంచుకుతింటే  తృప్తి ఆనందం!తరతమభేదాలుండవు.మనం మంచి మానవత్వంని  పెంచి పంచుకోగలం.3.1939లో గురు దేవ్ రవీంద్ర నాధ్ ఠాగూర్  అనారోగ్యంతో ఉన్నారు.
 "మీరు విశ్రాంతి తీసుకోవాలి "అని డాక్టరు ఎంత చెప్పినా  తన పని మానేవారుకాదు.అప్పుడు గాంధీజీ శాంతినికేతన్లో ఉన్నారు. "బాపూ!మీరు గురు దేవ్ కి విశ్రాంతి తీసుకోమని నచ్చ జెప్పండి"అని  అంటే మధ్యాహ్నం భోజనం ముగించి  బాపు ఆయన దగ్గరకు వెళ్లి "విశ్రాంతి తీసుకోవాలి కదా అన్నం తిన్న తరువాత!ఆరోగ్యం బాగా లేనప్పుడు పని ఎందుకు చేస్తారు?"అని మందలించారు. ఠాగూర్ చెప్పిన జవాబు ఇది "నాకు 12ఏళ్ల వయస్సు లో ఉపనయనం చేశారు. ఎలాంటి పరిస్థితులలోనూ విశ్రాంతి తీసుకోకూడదు అని ఆనాడే
 నిశ్చయించుకున్నాను.ఇప్పుడు నా ప్రతినను నేను ససేమిరా విడిచి పెట్టను."బాపూ  మరింక నోరెత్తలేదు.5.పీష్వాల న్యాయాధీశుడు రామశాస్త్రి  న్యాయానికి ధర్మం కి పెట్టింది పేరు. పీష్వా రఘోబా తనమేనల్లుడిని హత్య చేశాడు. తనకు ఉరిశిక్ష  తప్పదని భయపడ్డాడు. రాణీ  శ్యామశాస్త్రి ని పిలిచి సలహా కోరింది. "న్యాయ పీఠంపై కూచున్న నేను  నేరస్తునికి తప్పక శిక్ష విధించితీరుతాను"అన్నాడు ఆయన. "మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?"అహంకారంగా అడిగింది."అమ్మా!మీబెదిరింపులకు లొంగను.పీష్వా కి శిక్ష విధించి తీరుతాను.నా ప్రాణంపోయినా సరే!మీ పీష్వా హంతకుడు. జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!"అనేసితన పదవికి రాజీనామా చేశాడు.మరి నేటి న్యాయవ్యవస్థ  నత్తనడక నడుస్తోంది. తప్పులుచేసినవారు ఎంచక్కా జామీను పై కాలరెగరేస్తూ తిరుగుతూంటే కిడ్నాప్ చేసేవారు  అత్యాచారాల వారు  తప్పించుకుని తిరుగుతున్న రోజులు!అరబ్ దేశాల్లో వెంటనే  శిక్ష అమలుపరచటంతో నేరాలు అంతగా జరగవుట!మనం చేతికి చిక్కిన ఉగ్రవాదులను ఏళ్ల తరబడి పెంచి పోషిస్తున్నాం.అంతా రామశాస్త్రి లాగా ఉంటే?దేశం ఇన్ని సమస్యల వలయంలో చిక్కదు.

కామెంట్‌లు