సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల,ఖమ్మం*
  *పొదుపు చేయడం మంచి అలవాటు*. *కొందరు పొదుపుకు సరైన అర్థం తెలియక* *పొదుపు చేసే*
*వారిని  పిసినారి* *అంటుంటారు* *పొదుపరికి,పిసినారికి సహస్రం తేడా ఉంది*. *పొదుపరి అవసరమైన చోట ఆనందంగా ఖర్చు పెడతాడు*. *అనవసరమైన ఖర్చును అస్సలు ఇష్టపడడు ,చేయడు*. 
*పిసినారి తాను తినక ఇతరులకు పెట్టకుండా కూడేస్తుంటాడు*. *ఇలా లోభత్వంతో దాచిన సొమ్ము చివరికి పరుల పాలే అవుతుంది.*
*కాబట్టి పొదుపు చేయడం గొప్ప గుణమే కాదు- గొప్ప ఆదాయం కూడా.. చిన్నప్పటి నుంచే దుబారా ఖర్చులు చేయకుండా,పిసినారిగా మారకుండా పిల్లలను మంచి పొదుపరులుగా తీర్చిదిద్దాలి. అది వారు ఉపయోగించే నోటుబుక్కులు,పెన్నుల నుండే మొదలయ్యేలా చూడాలి.*
*ఉషోదయ నమస్సులతో

*
కామెంట్‌లు