దేశానికే సూర్యులు;--పెందోట వెంకటేశ్వర్లు -- అధ్యక్షులు, శ్రీవాణి సాహిత్య పరిషత్
ముత్యాలు రత్నాలు ఉయ్యాలో
 సముద్రాలో ఉంటాయి ఉయ్యాలో
అలలతో పాటుగా ఉయ్యాలో 
పై పైకి వస్తాయిఉయ్యాలో 

ఒడ్డుకే చేరేను ఉయ్యాలో
 ఒడ్డుకు చేరిన ఉయ్యాలో
 ఇసుకలో నుంటాయి ఉయ్యాలో 
మంచి వాళ్ళు కూడా ఉయ్యాలో 
మన మధ్య నుంటారు ఉయ్యాలో 

మంచినే చేస్తారు ఉయ్యాలో
మంచినే  చెబుతారు ఉయ్యాలో
వారిలాగ చేస్తు ఉయ్యాలో 
చూసి నేర్చుకోవాలి ఉయ్యాలో
మంచోల్లు మీరైతె ఉయ్యాలో
సేవలే చేస్తారు ఉయ్యాలో 
దేశానికే మీరు ఉయ్యాలో
సూర్యులె అవుతారు ఉయ్యాలో

కామెంట్‌లు